: ప్రపంచ దేశాల్లోని శాస్త్రవేత్తలు భారతీయ పురాతన శాస్త్రాలు తిరగేస్తున్నారు: దలైలామా

ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా బీహార్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ ప్రపంచానికి గురువు వంటిదని అన్నారు. భారత్ లో సంబంధాలు నెరపేవారందరితో గురుశిష్య సంబంధం ఉంటుందని చెప్పారు. భారత్ గురువైతే మనమంతా శిష్యులమని ఆయన చెప్పారు. నితీష్ కుమార్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

 రాష్ట్ర వ్యాప్తంగా మద్య నిషేధం విధించడం గొప్ప నిర్ణయమని ఆయన ప్రశంసించారు. మద్యం తాగడం మంచిది కాదని, అది మనిషి ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని తెలిపారు. మనిషి ప్రతిరోజూ ఎన్నో సమస్యలు, చికాకులు కలిగి ఉంటాడని, అలాంటి మనిషి మద్యాన్ని తాగడం మంచిది కాదని ఆయన చెప్పారు. అందులోంచి బయటపడాలంటే మనసుకు శిక్షణ ఇవ్వాలని ఆయన తెలిపారు. ఈ విషయంలో భారత్ ప్రపంచానికి గురువని ఆయన పేర్కొన్నారు. ఈ రోజుల్లో ప్రపంచదేశాల్లోని శాస్త్రవేత్తలు భారత్ లోని పురాతన శాస్త్రాలు, తత్వశాస్త్రాన్ని తిరగేస్తున్నారని ఆయన తెలిపారు. 

More Telugu News