: మా దేశాన్ని భారత్ ముక్కలు చేయలేదు: పాకిస్థాన్ మంత్రి

పాకిస్థాన్‌ ను భారత్ ముక్కలు చేయలేదని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి చౌదరి నిసర్ అలీ ఖాన్ తెలిపారు. ఇస్లామాబాద్ లో ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ భూభాగం విషయంలో భారత్‌ విజయం సాధించలేదని అన్నారు. పాకిస్థాన్‌ ముక్కలైపోతుందని భారత్‌ భావిస్తోందని, అది ఎన్నటికీ జరగదని ఆయన తెలిపారు. తాము అరెస్టు చేసిన కల్బుషణ్ యాదవ్ భారత్ గూఢచారి అనేందుకు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. భారత్ లో మైనారిటీల పరిస్థితి నానాటికీ దిగజారుతోందని, జమ్మూ కశ్మీర్ లో హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అన్నారు. కాగా, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, దొంగ యుద్ధ విధానాన్ని, అంగీకరించకూడని పోకడలను పాకిస్థాన్‌ అనుసరించడం ఆపకుంటే ఆ దేశం పది ముక్కలు అవుతుందని పేర్కొన్న సంగతి, బలూచిస్థాన్ స్వాతంత్ర్యసాధనకు భారత్ మద్దతునిస్తుందని భారత్ ప్రకటించిన సంగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆందోళన చెందుతున్న పాకిస్థాన్ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. 

More Telugu News