: బావిలో పడిన రెండు ఏనుగుల కోసం గ్రామంపై దాడికి వచ్చిన 120 ఏనుగుల మంద

అడవి నుంచి తప్పిపోయి వచ్చిన రెండు ఏనుగులు ప్రమాదవశాత్తూ బావిలో పడటంతో వాటి కోసం దాదాపు 120 ఏనుగులతో ఉన్న మంద వచ్చి కూర్చుంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని లల్కా గ్రామంలో జరిగింది. ఏనుగుల మంది మొత్తం బావి చుట్టూ కూర్చుని ఎటూ కదలకపోవడంతో బావిలో పడ్డ ఏనుగులను ఎలా రక్షించాలో తెలియక అటవీ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బావి చుట్టూ ఓ రక్షణ వలయంగా ఏనుగులు నిలబడగా, ఆ గుంపులోని ఓ ఏనుగు ప్రసవించిందని తెలిపారు. ఏనుగుల గుంపు దాడి వార్తలతో పలు పరిసర గ్రామాల ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. పక్క గ్రామాలవైపు ఏనుగులు రాకుండా ఉండేందుకు ఫ్లేమింగ్ టార్చ్ లను సరఫరా చేశామని, ఈ ఏనుగులను తరిమిన తరువాతే బావిలోని ఏనుగులను బయటకు తీసే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

More Telugu News