: టాటా బోర్డుపై లేఖాస్త్రం సంధించిన మిస్త్రీ

టాటా గ్రూప్ ఛైర్మన్ పదవి నుంచి తనను తొలగించడంపై సైరస్ మిస్త్రీ ఆవేదన వ్యక్తం చేశారు. తనను తొలగించిన విధానం ఏమాత్రం అంగీకారయోగ్యం కాదని చెప్పారు. ఈ మేరకు టాటా బోర్డుకు ఆయన ఓ ఈమెయిల్ లేఖాస్త్రం సంధించారు. తనను తొలగించిన విధానం అసాధారణమైనదని, విపరీత చర్య అని మెయిల్ లో ఆయన మండిపడ్డారు. కనీసం వివరణ ఇచ్చుకోవడానికి కూడా తనకు అవకాశం ఇవ్వలేదని అన్నారు. ఛైర్మన్ పదవి నుంచి మిస్త్రీని తొలగించి, రతన్ టాటాను తాత్కాలిక ఛైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. తమపై మిస్త్రీ లీగల్ చర్యలు తీసుకోకముందే... టాటా గ్రూపు జాగ్రత్తపడుతోంది. ముందు జాగ్రత్త చర్యగా కేవియట్ ను దాఖలు చేసింది. తొమ్మిది మంది సభ్యులున్న బోర్డులో... ఆరుగురు సభ్యులు మిస్త్రీని తొలగించడానికి అనుకూలంగా ఓటు వేశారు. ఇద్దరు సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. రూల్స్ ప్రకారం మిస్త్రీకి ఓటు వేసే అవకాశం లేదు. మరోవైపు, టాటా గ్రూపుపై లీగల్ చర్యలు తీసుకునే దిశగా ప్రస్తుతానికి మిస్త్రీ ఆలోచించడం లేదని ఆయన కార్యాలయం తెలిపింది.

More Telugu News