: రియో రెజ్లర్ల బృందానికి స‌చిన్ టెండూల్క‌ర్ టిప్స్

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న రియో ఒలింపిక్స్ కోసం భారత టీమ్‌కి గుడ్ విల్ అంబాసిడ‌ర్‌గా ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ని నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఒలింపిక్స్‌కు అర్హ‌త పొందిన రెజ్ల‌ర్ల‌తో క్రికెటర్ స‌చిన్‌ స‌మావేశ‌మ‌య్యాడు. ఈ సంద‌ర్భంగా వారికి ఛాలెంజ్‌ల‌ను స్వీక‌రించే క్ర‌మంలో పాటించాల్సిన ప‌లు సూచ‌న‌లు చేశాడు. రెజ్లర్లలో నూత‌న ఉత్సాహాన్ని నింపాడు. ఒత్తిడిని జ‌యించే టిప్స్ చెప్పాడు. రెజ్లింగ్‌లో ప్ర‌త్య‌ర్థి బ‌ల‌హీన‌త‌ల‌ను ఎలా క‌నిపెట్టాలో స‌చిన్ రెజ‌ర్ల‌కు సూచ‌న‌లిచ్చాడు. స‌చిన్‌తో రెజ‌ర్లు రెండు గంట‌లు ముచ్చ‌టించార‌ని, లంచ్ చేశార‌ని, టెండూల్క‌ర్‌ వారిలో ఎంతో ఉత్సాహాన్ని క‌లిగించాడ‌ని ఉమెన్స్ రెజ్లింగ్ టీమ్ కోచ్ కుల్దీప్ సింగ్ మీడియాకు తెలిపారు. ఈ సంద‌ర్భంగా తాను క్రీడాకారుల‌తో దిగిన ఓ ఫోటోను స‌చిన్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

More Telugu News