: 108 ఏళ్ల నాటి సీసా సందేశం... అడ్రెస్ కు చేరిస్తే 64 పైసల బహుమతి లభించింది!

నిజమేనండోయ్, సముద్ర తీరంలో లభించిన ఓ సీసా సందేశాన్ని అందులో పేర్కొన్న చిరునామాకు చేర్చినందుకు జర్మనీ మహిళకు 64 పైసలు (ఒక షిల్లాంగ్) బహుమతి లభించింది. ఆసక్తి కలిగించే ఈ ఘటన జర్మనీకి చెందిన అమ్రమ్ ద్వీపంలో జరిగింది. ద్వీపంలోని పోస్టల్ శాఖలో పనిచేస్తున్న మరియన్నే వింక్లర్ అనే మహిళ సెలవు రోజున సముద్ర తీరం వెంట నడుస్తుండగా, నీటిలో ఓ సీసా తేలియాడుతూ కనిపించింది. వెంటనే దాన్ని తీసుకున్న ఆమె నేరుగా ఇంటికెళ్లి పరీక్షగా చూసింది. సీసాలో ఉన్న పేపర్ పై ‘బ్రేక్’ అనే సందేశం కనిపించింది. సీసా మూత తీసేందుకు యత్నించిన వింక్లర్ దంపతులు అది సాధ్యపడకపోవడంతో సందేశం మేరకు సీసాను బద్దలు కొట్టారు. ఇంగ్లిష్, జర్మన్, డచ్ భాషల్లో సందేశం రాసి ఉన్న పేపర్ అందులో నుంచి బయటపడింది. ఈ సీసా దొరికిన వారు తమ పూర్తి అడ్రెస్ రాస్తూ, సీసా ఎక్కడ దొరికిందన్న విషయాన్ని తెలుపుతూ ఫ్లై మౌత్ లోని బయాలాజికల్ అసోసియేషన్ కు పంపగలరని అందులో రాసి ఉంది. అలా పంపిన వారికి ఒక షిల్లాంగ్ బహుమతి ఇస్తామని కూడా అందులో ఉంది. దీంతో వింక్లర్ దంపతులు తమ అడ్రెస్ రాసి దానిని అందులో రాసి ఉన్న చిరునామాకు పంపారు. దీనిని అసోసియేషన్ కమ్యూనికేషన్ డైరెక్టర్ గై బేకర్ అందుకున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఈ సీసా తమ కంపెనీదే అని, 1902-04 మధ్య తమ సంస్థ వారే ఈ సీసాను సముద్రంలో విసిరేసి ఉంటారని చెప్పారు. అందులో రాసి ఉన్నట్లుగానే వింక్లర్ దంపతులకు ఆయన ఒక షిల్లాంగ్ బహుమానాన్ని అందజేశారు.

More Telugu News