: పెంపుడు జంతువు పుట్టిన రోజుకు ఫైవ్ స్టార్ హోటల్ అద్దెకు తీసుకున్నాడు

పిల్లల పుట్టిన రోజు వేడుకలను తల్లిదండ్రులు ఘనంగా నిర్వహిస్తూ వుంటారు. వారి వారి తాహతును బట్టి ఈ వేడుకలు వుంటాయి. అయితే, తాము గారాబంగా చూసుకునే పెంపుడు జంతువుల బర్త్ డే లను కూడా ఆడంబరంగా నిర్వహించే మనుషులు కూడా వున్నారు. చైనాకు చెందిన వాంగ్ జియలిన్ అనే కోటీశ్వరుడి కుమారుడు అందరికీ విభిన్నంగా సీల్ ను పెంచుకుంటున్నాడు. ఈ సీల్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకు చైనాలో అత్యంత ఖరీదైన ఓషన్ స్ప్రింగ్ అనే ఫైవ్ స్టార్ హోటల్ మొత్తాన్ని బుక్ చేసుకున్నాడు. హోటల్ లోని స్విమ్మింగ్ పూల్ లో సీల్ ఆడుకునేందుకు ఏర్పాట్లు చేయించాడు. ఈ సౌకర్యాలకు తోడు హాటల్ లోని ఖరీదైన భోజనం ఆర్డర్ చేసి సీల్ తో స్వయంగా తినిపించాడు. తన యజమాని చేసిన పుట్టిన రోజు ఏర్పాట్లను సీల్ అనుభవిస్తూ పండగ చేసుకుంటోందట.

More Telugu News