ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్ కాశ్ పటేల్ నియామకం

  • 51-49 ఓట్ల తేడాతో కాశ్ పటేల్ నియామకం
  • అమెరికన్లకు హాని తలపెట్టాలని చూస్తే సహించేది లేదన్న కాశ్ పటేల్
  • ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీగా ఉంటామని హామీ
అమెరికా దర్యాఫ్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్ కాశ్ పటేల్ నియామకానికి 
సెనేట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయన 'ఎక్స్' వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లకు ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే సహించేది లేదని పేర్కొన్నారు.

ఎఫ్‌బీఐ తొమ్మిదో డైరెక్టర్‌గా తనను నియమించడం ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉందని కాశ్ పటేల్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అటార్నీ జనరల్ పామ్ బోండీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన ఎఫ్‌బీఐ దేశ ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. 

కాశ్ పటేల్ పేరును అలస్కాకు చెందిన రిపబ్లికన్లతో పాటు పలువురు డెమోక్రట్లు వ్యతిరేకించారు. అయితే, 51-49 ఓట్ల తేడాతో ఆయన నియామకం జరిగింది. ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవిని చేపట్టిన తొలి హిందూ, భారతీయ అమెరికన్ కాశ్ పటేల్ కావడం గమనార్హం. కాశ్ పటేల్‌కు ట్రంప్ విధేయుడిగా పేరు ఉంది. 


More Telugu News