: స్నోడెన్ కు ఆశ్రయం నిరాకరణ పిరికి పంద చర్య: కేజ్రివాల్
అమెరికా రహస్యాలను ప్రపంచానికి బహిర్గతం చేస్తున్న ఎడ్వర్డ్ స్నోడెన్ కు భారత్ ఆశ్రయం కల్పించకపోవడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ తప్పుబట్టారు. స్నోడెన్ అభ్యర్థన తిరస్కరించడాన్ని పిరికి పంద చర్య అని కేజ్రివాల్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగం పౌరహక్కులను కాపాడాలని చెబుతుందని, కానీ, పాలకులు తద్విరుద్ధంగా వ్యవహరించారని ఆయన దుయ్యబట్టారు.