: దీపిక ఏనుగులా తింటుంది: షారూఖ్ చలోక్తి
బాలీవుడ్ స్లిమ్ బ్యూటీ దీపికా పదుకొనేపై షారూఖ్ ఖాన్ చలోక్తులు విసిరాడు. 'చెన్నై ఎక్స్ ప్రెస్' సినిమాలో తన పక్కన కథానాయికగా నటించిన దీపిక ఏనుగులా తింటుందని చమత్కరించాడు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రం బృందం ఓ రియాలిటీ షోలో పాల్గొంది. ఈ షోలో షారూఖ్ సరదాగా జోకులేస్తూ హుషారుగా కనిపించాడు. దీపిక షూటింగ్ సమయంలో విపరీతంగా తినేదని చెప్పి అందరిలోనూ నవ్వులు పూయించాడు. ఇక కింగ్ ఖాన్ కు దర్శకుడు రోహిత్ శెట్టి కూడా జతకలిశాడు.
దీపిక ప్రతి రెండుగంటలకోసారి తిండి లాగిస్తుందంటూ ఈ కన్నడభామను మరింత ఉడికించాడు. ఎక్కడో కొండప్రాంతాల్లో షూటింగ్ చేసే సమయంలో తాము బిస్కట్లు, టీ తీసుకునేవారమని.. దీపిక మాత్రం తామందరి ఆహారం తానొక్కతే ఆరగించేదని తెలిపాడు. చివరికి స్పాట్ బాయ్ లు తెచ్చుకున్నవీ తినేసేదని రోహిత్ శెట్టి దీపికను ఆటపట్టించాడు.