: లగడపాటి అనవసరంగా తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు: హరీష్ రావు
ఎంపీ లగడపాటి అనవసరంగా తెలంగాణను వ్యతిరేకిస్తున్నారని టీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రకటిస్తారని వస్తున్న వార్తలపై లగడపాటి స్పందనను ప్రసార మాధ్యమాల్లో చూసిన హరీష్ రావు హైదరాబాద్ లో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై లగడపాటికి నమ్మకం లేనట్టు కన్పిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. లగడపాటి వంటి నేతల మాటలతో ప్రజల్లో అభద్రతా భావం పెరుగుతుందని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఇక ఎవరూ అడ్డుకోలేరని హరీష్ రావు అన్నారు.