: నోటి దురదతో ముండేకి కొత్త కష్టాలు
గత వారం ముంబైలోని బహిరంగ సభలో ఎన్నికల ఖర్చుపై అకారణంగా చేసిన వ్యాఖ్యలు గోపీనాధ్ ముండేకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ప్రచారానికి 8 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని ముండే పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేయగా తాజాగా ఆదాయపుపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. గోపీనాధ్ ముండే ఆదాయ వనరులను తెలపాలని, అలాగే చెల్లించిన పన్నుల వివరాలను కూడా అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.