: పాక్ జట్టు కూడా భారత్ లా ఆడాలి: అఫ్రిది


పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఏమంటున్నాడో వినండి. పాకిస్తాన్ జట్టు కూడా టీమిండియాలా ఆడాలని సలహా ఇస్తున్నాడు. భారత్ జట్టు ప్రదర్శించే సానుకూల దృక్పథాన్ని జాతీయ జట్టు సభ్యులూ అలవర్చుకోవాలని సూచిస్తున్నాడు. ప్రస్తుతం లాహోర్లోని జాతీయ క్రికెట్ అకాడమీలో సాధన చేస్తున్న ఈ వెటరన్ ఆల్ రౌండర్ నేడు మీడియాతో ముచ్చటించాడు. కొద్ది సంవత్సరాల క్రితం భారత క్రికెట్ కూడా పడుతూ లేస్తూ సాగిందని, వారు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ను ఏలుతున్నారని గుర్తు చేశాడు.

బహుశా భారత క్రికెటర్లు ఆసీస్ తరహా దృక్పథాన్ని ఒంటబట్టించుకుని ఉంటారని అఫ్రిది అభిప్రాయపడ్డాడు. అందుకే, అంతలా క్రికెట్ ను ఆస్వాదించగలుగుతున్నారని విశ్లేషించాడు. ఇక మంచి ఫలితాలు రావాలంటే పాకిస్తాన్ జట్టు కూడా దాయాది దారిలో నడవాల్సిందే అని స్పష్టం చేశాడు. ఇటీవలే ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలో పాక్ జట్టు మూడు లీగ్ మ్యాచ్ లలోనూ ఓటమిపాలై అవమానకరరీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News