: కేసీఆర్ అన్న కూతురి ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి


టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్న కూతురు రమ్య ఇంటిపై ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్ దల్ (టీఆర్ఎల్ డీ) రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రేగులపాటి రమ్య నిన్న కేసీఆర్ ను విమర్శించారు. తెలంగాణ మాదిగ దండోరా నాయకుడు చింతా స్వామి ఆధ్వర్యంలో వేయి డప్పులు... లక్ష చెప్పులు కార్యక్రమంలో పోస్టర్ విడుదల చేసిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ ధోరణిని తాను వ్యతిరేకిస్తున్నానని అన్నారు. అంతేకాక, లక్ష చెప్పుల్లో తన చెప్పు కూడా ఉంటుందని తెలిపారు. దీంతో ఆగ్రహించిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె ఇంటిపై దాడి చేశారు.

  • Loading...

More Telugu News