: ఒక్క ఘటన మగాళ్లమీద నమ్మకాన్ని చంపేసింది: పారిస్ హిల్టన్
ఒకే ఒక్క నమ్మక ద్రోహం మగాళ్లపై నమ్మకాన్ని చంపేసిందని ప్రముఖ మోడల్, అమెరికా రియాల్టీ టీవీషో వ్యాఖ్యత పారిస్ హిల్టన్ తెలిపింది. 32 ఏళ్ల హలీవుడ్ సెలబ్రటీ తనను అత్యంత బాధకు గురిచేసిన సంఘటన కూడా అదేనని అభిప్రాయపడింది. తను గాఢంగా ప్రేమించిన సలోమోన్ తో గడిపిన శృంగార దృశ్యాలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడంతో అవాక్కయింది. అప్పట్నుంచీ మగాళ్లందర్నీ నమ్మడం మానేశానని సెలవిచ్చింది అమ్మడు. ఇందులో విశేషమేంటంటే, పారిస్ హిల్టన్ కి అప్పట్నుంచే మరింత స్టార్ డమ్ పెరిగింది!