: ఐటీ అధికారులమంటూ దోపిడీ
ఐటీ అధికారులమని చెప్పి ఓ ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు అగంతకులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని పాండురంగా నగర్ లో దుండగులు ఐటీ అధికారులమని చెప్పి 2 లక్షల రూపాయల నగదు, 20 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. తీరా వారు ఐటీ అధికారులు కాదని, జరిగింది పెద్ద మోసమని తెలియడంతో నెత్తీ నోరు బాదుకుంటున్నారు బాధితులు.