: తెలంగాణకు ఎనభైవేల కోట్ల ప్యాకేజికి సీఎం ప్రతిపాదన.. సోనియా నిరాకరణ?


తెలంగాణ ప్రాంతానికి రూ.80,000 కోట్ల ప్యాకేజి ఇద్దామని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రతిపాదనకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నుంచి నిరాకరణ ఎదురైనట్టు తెలుస్తోంది. ప్రత్యేక రాష్ట్ర అంశం తుదిదశకు వచ్చిన తరుణంలో ప్యాకేజీలు ప్రకటించడం సమంజసం కాదని, ఏదో ఒక నిర్ణయం తేల్చిచెప్పాలన్నదే సోనియా అభిమతమని పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా, ఎనభైవేల కోట్ల ప్యాకేజి వ్యవహారమై మేడమ్ తో చర్చించాలని తీవ్రంగా ప్రయత్నించిన సీఎం కిరణ్ కు మరోసారి నిరాశ తప్పలేదు. భేటీకి సోనియా నిరాకరించినట్టు సమాచారం. కిరణ్ తో నేరుగా మాట్లాడకుండా.. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ ను తన దూతగానే మొన్న హైదరాబాద్ కు పంపి ఉంటుందని రాష్ట్ర నేతల భావన. ఆ విషయం నిజమే అనిపించేలా.. దిగ్విజయ్ కూడా ఎక్కడా ప్యాకేజి ఊసేలేకుండా, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News