: రాష్ట్ర కాంగ్రెస్ మహిళ విభాగానికి కొత్త నేత


రాష్ట్ర కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఆకుల లలితారాఘవేందర్ ఎంపికయ్యారు. గాంధీభవన్ లో ఈ మధ్యాహ్నం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే లలిత ఇప్పటివరకు నిజామాబాద్ డీసీసీ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. కాగా, ఈ పదవీబాధ్యతల స్వీకారోత్సవానికి జాతీయ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అనితా వర్మ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, పీసీసీ మాజీ చీప్ డి.శ్రీనివాస్, సీనియర్ నేత షబ్బీర్ అలీ, మహిళానేత గంగాభవాని తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News