: శృంగారం చేసుకోవాలంటూ వీడియో తీసిన జవాన్లు


పోలీసులు ఉన్నదే రక్షణకు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే తప్పుడు పనులకు దిగితే ఇక భద్రత ఎక్కడిది? ఇలాంటి సంఘటనే ఒకటి మణిపూర్ రాష్ట్రంలో జరిగింది. ఇండియన్ రిజర్వ్ బెటాలియన్(ఐఆర్ బీ)కు చెందిన నలుగురు జవాన్లు చురచందపూర్ జిల్లాలోని ఖుగ డ్యామ్ పరిసరాల్లో పెట్రోలింగ్ కు వెళ్లారు. ఇది నిషేధిత ప్రాంతం. వారెళ్లిన సమయంలో అక్కడ ఒక జంట శృంగారంలో మునిగితేలుతూ కన్పించింది. అది చూసిన జవాన్లు వారిపై చర్య తీసుకోవాల్సింది పోయి.. దాన్ని కొనసాగించండంటూ వీడియో తీశారు. తర్వాత దాన్ని ఆన్ లైన్లో పెట్టారు. ఇది ఉన్నతాధికారులకు తెలియడంతో ఆ నలుగురు జవాన్లను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచారు. కోర్టు వారిని ఆరు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది.

  • Loading...

More Telugu News