: కాంగ్రెస్ ఎప్పుడూ ఇంతే: చంద్రబాబు
కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఎన్నికలను సకాలంలో నిర్వహించదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. విశాఖపట్నంలో జరిగిన టీడీపీ ప్రాంతీయ సదస్సులో బాబు ఉత్తరాది జిల్లాలకు చెందిన పార్టీ నేతలు, కార్యర్తలనుద్ధేశించి ప్రసంగించారు. వారిని పంచాయతీ ఎన్నికలకు కార్యోన్ముఖుల్ని చేసే దిశగా ఆయన మాట్లాడారు. తమ హయాంలో సర్పంచ్ లకు పూర్తి అధికారాలిచ్చామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం సర్పంచ్ ల అధికారాలు, విధులను ఇతరులకు బదిలీ చేసి సర్పంచ్ లను నామమాత్రులను చేసిందని విమర్శించారు.