: ఆ అన్నం తింటే లావెక్కరట!


'తిండి కలిగితే కండ కలదోయ్... కండ కలవాడే మనిషోయ్' అన్నారు మన గురజాడ. అది ఒకప్పటి మాట. రెండు ముద్దలు అన్నం ఎక్కువ తింటే లావయిపోతామనే భయం నేటి తరానిది. ఇక మీకు ఆ భయమే లేదని భరోసా ఇస్తోంది, లండన్ కు చెందిన 'ఈట్ వాటర్' అనే సంస్థ. 

తక్కువ కేలరీల శక్తిని అందించే సన్న అన్నం (స్లిమ్ రైస్) ని ఈ సంస్థ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి, 97 శాతం నీరుతో నిండి ఉండే ఈ కొత్తరకం అన్నం కొద్దిగా తింటే చాలు కడుపు నిండిపోతుందని ఆ సంస్థ చెబుతోంది.

అయితే, సాధారణ బియ్యం కంటే ఈ సన్న అన్నం కాస్త ఖరీదైనదే. లండనులో ప్యాకెట్ ధర  రూ. 213 అమ్ముతున్నారు. అన్నమే కాదు స్లిమ్ పాస్తా, స్లిమ్ నూడిల్స్ అంటూ ఈట్ వాటర్ సంస్థ వినియోగదారులను ఆకర్షిస్తోంది. అయితే ఈ అన్నం తింటే అందం సంగతి దేవుడెరుగు, పోషకాహార లోపంతో బాధపడతారని లండనులోని ఓబెసిటీ ఫోరం మరోపక్క ఆరోపిస్తోంది.

  • Loading...

More Telugu News