: ఉద్యోగమిస్తానని ఎయిర్ హోస్టెస్ తో కామ కలాపాలు
పెళ్లి చేసుకుంటానని, తన దగ్గర మంచి ఉద్యోగమిస్తానని ముంబైలోని ఒక ఇన్వెస్ట్ మెంట్ బ్యాకింగ్ కంపెనీ సీఈఓ ఎయిర్ హోస్టెస్ నే బుట్టలోకి దింపాడు. ఎంచక్కా ఢిల్లీకి తీసుకెళ్లి రాసలీలలు నడిపాడు. తర్వాత ప్లేటు ఫిరాయించడంతో సదరు ఎయిర్ హోస్టెస్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 26 ఏళ్ల సదరు యువతి గతంలో దుబాయ్ కు చెందిన ఎమిరేట్స్ లో ఎయిర్ హోస్టెస్ గా పనిచేసేది. ముంబైలోని ఒక ఫంక్షన్ లో ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ తో పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత "శృంగారం చేసుకుందాం.. నీకు మంచి ఉద్యోగమిస్తా.. పెళ్ళి చేసుకుంటా" అని సీఈఓ ఆఫర్ చేశాడు. ఆమె సరేనంది. దీంతో వారిద్దరూ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ఒక హోటల్లో విడిది చేసి సరదాలు తీర్చుకున్నారు. ముంబైకి తిరిగి వెళ్లిన తర్వాత పెళ్లి చేసుకోవాలని కోరడంతో అతడు నిరాకరించాడు. విషయం పోలీసుల ముందుకు వెళ్లింది.