: కోహ్లీ కెప్టెన్సీలో తడబడ్డ భారత్


మహేంద్ర సింగ్ ఆడలేని పరిస్థితుల్లో విరాట్ కోహ్లీకి కెప్టెన్ గా తొలి అవకాశం వచ్చింది. విండీస్ గడ్డపై శ్రీలంకను మట్టికరిపించి భవిష్యత్తు కెప్టెన్ పోస్ట్ ను షురూ చేసుకుందామనుకున్నాడు కోహ్లీ. కానీ అతడి ఆశలు నెరవేరలేదు సరికదా.. క్రికెట్ అభిమానులు మర్చిపోలేని రీతిలో ఘోర పరాజయం ఎదుర్కోవాల్సి వచ్చింది. భారత్ శ్రీలంక చేతిలో 161 పరుగుల తేడాతో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

పరాజయంపై కోహ్లీ స్పందిస్తూ.. "మా బౌలింగ్ సరిగా లేదు. లంకేయుల బ్యాటింగ్ నిజంగా చాలా బాగుంది. మేం బ్యాటింగ్ చేసేటప్పుడు మా స్థాయిని ప్రదర్శించలేదు" అని బాధగా చెప్పాడు. 350 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఛేదించడానికి ముందునుంచే ధాటిగా ఆడాల్సి ఉన్నా ఆడలేకపోయామన్నాడు. అయినా, ఇప్పటికీ ఫైనల్ అవకాశాలున్నాయని, వచ్చే రెండు మ్యాచుల్లో గెలిస్తే ఫైనల్ కు వెళ్లొచ్చంటూ కోహ్లీ కాస్త ఆశాభావం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News