: పట్టపగలే వైన్ షాపులో దోపిడీ యత్నం.. కాల్పులు
హైదరాబాద్ లో దుండగులు పట్టపగలే దోపిడీకి తెగించారు. బాలానగర్ లోని ఒక వైన్ షాపులోకి ప్రవేశించి దోపిడీకి విశ్వ ప్రయత్నం చేశారు. అడ్డగించిన యజమాని సతీష్ పై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ప్రమాదంలో సతీష్ చేతికి గాయమైంది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.