: రైతుల రుణమాఫీపై సీఎం వ్యాఖ్యలు పొంతనలేనివి: టీడీపీ


రాష్ట్రంలో రైతుల రుణమాఫీలకు సంబంధించి ముఖ్యమంత్రి కిరణ్ మాటలపై టీడీపీ మండిపడింది. ఒక్కోసారి ఒక్కోవిధంగా సీఎం పొంతనలేని మాటలు చెబుతున్నారని  విమర్శించింది. ఒకసారి రైతుల రుణాలు రూ.60వేల కోట్లు అని చెప్పి, మరొకసారి రూ.70వేల కోట్లని, ఇంకోసారి రూ.లక్షా 16వేల కోట్లని చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో చెప్పాలని ప్రశ్నించింది.

హైదరాబాదు టీడీపీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నేతలు
 గాలి ముద్దు కృష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడారు. రుణాల మాఫీ పేరుతో కాంగ్రెస్ నేతలు ప్రజల సొమ్మును అక్రమంగా తింటున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడంచెల విధానాన్ని పునరుద్దరించాలని వారు డిమాండు చేశారు.

  • Loading...

More Telugu News