: విశాఖ చేరుకున్న చంద్రబాబు


స్థానిక సంస్థల ఎన్నికలకు గాను మరికొద్ది సేపట్లో నోటిఫికేషన్ వెలువడనుండగా.. పార్టీ శ్రేణులను ఆ దిశగా సన్నద్ధం చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నడుంబిగించారు. ఈ క్రమంలో విశాఖలో నేడు పార్టీ ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో పాల్గొనేందుకు బాబు ఈ ఉదయం విశాఖ చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఉత్తరాది జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున విశాఖకు తరలిరావడంతో నగరం పసుపుమయమైంది.

  • Loading...

More Telugu News