: నకిలీ టికెట్ తో సింగపూర్ వెళ్లొచ్చిన కతర్నాగ్
ఒక ప్రయాణికుడు నకిలీ టికెట్ తో ఏకంగా విమాన ప్రయాణం పూర్తి చేశాడు. సింగపూర్ వెళ్లి తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన తర్వాత అతడి వద్దనున్నది నకిలీ టికెట్ గా గుర్తించారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆ టికెట్ ఎలా వచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు.