: భూమిని రక్షించుకోవాలంటే అణుబాంబులే అవసరం


అంతరిక్షం నుండి భూమిపైకి దూసుకువచ్చే గ్రహశకలాల నుండి భూమిని రక్షించుకోవాలంటే వాటిని ఎదుర్కొనేందుకు అణుబాంబులే సరైన సమాధానమని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపైకి దూసుకువచ్చే పెద్ద ఆకారంలోని గ్రహశకలాలను రోదసిలోనే గుర్తించి వాటిపైకి శక్తిమంతమైన అణుబాంబులను రోదసిలోకి పంపించి ఆ గ్రహశకలాలు భూమిని తాకకముందే, అక్కడే ధ్వసం చేయాలని శాస్త్రవేత్తల ఆలోచన.

అయోవా విశ్వవిద్యాలయానికి చెందిన అలెన్‌పిట్జ్‌ నేతృత్వంలోని ఒక పరిశోధకుల బృందం ఈ మేరకు ఒక ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనకు సుమారు 300 కోట్ల డాలర్లు అనగా సుమారు రూ.18 వేల కోట్లు ఖర్చు కావచ్చని కూడా అంచనా వేసింది. ఈ విషయం గురించి అలెన్‌పిట్జ్‌ మాట్లాడుతూ కేవలం స్వల్పకాలిక హెచ్చరికతోనే (పదేళ్లకన్నా తక్కువ సమయంలోనే) భూమిని ఢీకొనే ఖగోళ వస్తువుల విషయంలో అణుబాంబులను వినియోగించడం తప్పనిసరి, దీనికి మరో ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. గ్రహశకలాలను ధ్వంసం చేసే అణుబాంబులను మోసుకెళ్లడానికి పిట్జ్‌ బృందం 'హైపర్‌ వెలాసిటీ ఆస్టరాయిడ్‌ ఇంటర్‌సెప్ట్‌ వెహికిల్‌ (హెచ్‌ఏఐవీ)' అనే సాంకేతిక వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. ఈ ప్రణాళిక ప్రకారం మూడు టన్నుల బరువుండే హెచ్‌ఏఐవీ చాలా సులభంగా సూర్యుడి గురుత్వ శక్తిని దాటుకుని గ్రహశకలం సమీపంలోకి వెళ్లగలుగుతుంది. లక్ష్యాన్ని చేరుకోగానే హెచ్‌ఏఐవీలోని అణుబాంబు విడుదలైన గ్రహశకలం పైన పడి పేలిపోతుంది. ఈ పేలుడులో రెండు మెగాటన్నుల శక్తి విడుదలై గ్రహశకలం ముక్కలు ముక్కలవుతుంది.

  • Loading...

More Telugu News