: కేంద్ర హోం మంత్రిని లక్ష్యంగా చేసుకున్న బీజేపీ


హిందూ తీవ్రవాదం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేపై బీజేపీ అస్త్రాలు ఎక్కుపెడుతోంది. బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ నివాసంలో భేటీ అయిన పార్టీ నేతలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహలపై చర్చించారు. 

షిండే వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు వీవీఐపీ హెలికాఫ్టర్ల కుంభకోణం, పెట్రో ధరల పెంపు, భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు, ఎఫ్డీఐ వంటి పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. 

హిందూ తీవ్రవాదం అంటూ షిండే చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి తీరాలని లేకుంటే పార్లమెంటులో ఆయనపై  చెలరేగుతామని బీజేపీ నేతలు అంటున్నారు. అలాగే ఆయన ఇంటిని కూడా ముట్టడించేందుకు బీజేపీ సిద్ధమౌతోంది. యూపీఏ హయాంలో జరిగిన ప్రతి అవినీతిపైన పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎండగడతామని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

  • Loading...

More Telugu News