: అతి త్వరలో భారత్, పాక్ ప్రధానుల భేటీ


త్వరలోనే పాక్ ప్రధాని భారత ప్రధానిని కలువనున్నారు. ద్వైపాక్షిక అంశాలు, సత్సంబంధాల పునరుద్ధరణకు సంబంధించిన మూడోదఫా చర్చలకు రెండు దేశాలు సానుకూలంగా స్పందించాయి. అందులో భాగంగా ఇరు దేశాల ప్రధానుల భేటీకి విదేశాంగ మంత్రులు బీజం వేశారు. బ్రూనై రాజధాని బందెర్ సెరిలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తో పాక్ ప్రధాని ప్రత్యేక సలహాదారు సర్తాజ్ అజీజ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉభయ దేశాల మధ్య మూడో దఫా చర్చలకు అంగీకారం కుదిరింది. పాక్ లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇరుదేశాల మధ్య అత్యున్నత భేటీ ఇదే. అనంతరం పాక్ ప్రధాని ప్రత్యేక సలహాదారు సర్తాజ్ అజీజ్ మాట్లాడుతూ విశ్వాస పునరుద్ధరణ చర్యలకు ఉన్న వివిధ అవకాశాలపై ఇద్దరం చర్చించామన్నారు.

చర్చల ప్రక్రియను వేగిరపర్చాలని అంగీకారానికి వచ్చామని తెలిపారు. వచ్చే రెండు మూడు నెలల్లో వివిధ బృందాల మధ్య చర్చ ప్రక్రియ ఉంటుందని అన్నారు. కాగా సెప్టెంబరు లో న్యూయార్క్ లో జరుగనున్న ఐక్యరాజ్యసమితి సాధారణ వార్షిక సమావేశాల సందర్భంగా కానీ అంతకు ముందుగా కానీ వీరు సమావేశమవ్వనున్నారు. భారత్ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ పాక్ ప్రభుత్వం ఇప్పటికే మన్మోహన్ సింగ్ ను ఆహ్వానించిందని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News