: దిల్ షుక్ నగర్ దుర్మార్గులెవరొ తెలిసిపోయింది: డీజీపీ


దిల్ షుక్ నగర్ బాంబు పేలుళ్లకు పాల్పడిన వ్యక్తులు ఎవరో తెలిసిపోయిందని రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో డీజీపీ దినేష్ రెడ్డి మాట్లాడుతూ పేలుళ్ల కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించామని అన్నారు. పేలుళ్లకు పాల్పడిన వారెవరో జాతీయ దర్యాప్తు సంస్థకు, రాష్ట్ర పోలీసులకు తెలుసునన్నారు. అయితే వారి వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని, వెల్లడిస్తే నిందితులు శాశ్వతంగా పారిపోయే అవకాశం ఉందని డీజీపీ అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నట్టు దినేష్ రెడ్డి వివరించారు.

  • Loading...

More Telugu News