: సికింద్రాబాద్-విశాఖ మధ్య 14 స్పెషల్ ట్రైన్స్
సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య 14 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు పట్టణాల మధ్య 8 ఏసీ రైళ్లను నడుపనున్నామని అధికారులు తెలిపారు. ఇవి ఈ నెల 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 9:30 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరనుండగా, ఈ నెల 6, 13, 20, 27 తేదీల్లో రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి ఈ ప్రత్యేక రైలు బయలుదేరనుంది.