: ఆరోగ్యశ్రీ ఇక గులాబీ కార్డు దారులకూ వర్తింపజేస్తాం:కొండ్రు మురళి
త్వరలోనే గులాబీ కార్డు దారులకూ ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండ్రు మురళి చెప్పారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు పాత్రికేయులు, న్యాయవాదులు, అసంఘటిత రంగ కార్మికులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ఆరోగ్య శ్రీ బడ్జెట్ రూ. 1400 కోట్లు కాగా, వచ్చే ఏడాది రూ.1600 కోట్లు కేటాయించనున్నట్టు కొండ్రు చెప్పారు.