: 25 మంది టీడీపీ నేతలు అరెస్టు


విజయవాడ పోలీసులు 25 మంది టీడీపీ నేతలని అరెస్టు చేసి నగరంలోని పోలీసు స్టేషన్లకు తరలించారు. ఇంటింటికి తెలుగు దేశం పేరుతో విజయవాడలో టీడీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జీ బుద్దా వెంకన్న చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీకి అనుమతి లేదని ఏసీపీ హరికృష్ణ, వన్ టౌన్ సీఐ హనుమంతరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు దేవినేని ఉమ, కేశినేని నాని, నాగుల్ మీరా, కింజరాపు రామ్మోహన్ నాయడు, బద్దా వెంకన్నల ఆద్వర్యంలో పెద్ద సంఖ్యలో తెనాలి రోడ్డుపై రాస్తా రోకో చేయడంతో, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో 25 మంది టీడీపీ నేతలను అరెస్టు చేసి గవర్నరు పేట, సత్యనారాయణ పురం పోలీసు స్టేషన్లకు తరలించారు.

  • Loading...

More Telugu News