: మార్కెట్లో కొత్త యాంటీ వైరస్
మార్కెట్లో కొత్త యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ సందడి చేయనుంది. సాఫ్ట్ వేర్ డివైస్ లలో యాంటీవైరస్ సమస్యను పరిష్కరించే దిశగా జర్మనీకి చెందిన ఎగో సెక్యూర్ ఐఎన్ సీ సంస్థ కొత్త యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ ను హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల చేసింది. అంతర్జాతీయంగా పేరుగాంచిన ఏగో సెక్యూర్ ఎండ్ పాయింట్ ను భారత్ లో ప్రవేశ పెడుతున్నట్టు సంస్ధ వ్యవస్థాపకుడు నటాల్యా కాస్పర్ స్కై తెలిపారు. ఈ కొత్త ఉత్పత్తి ద్వారా యాంటీ వైరస్ సెక్యూరిటీ మార్కెట్ లో 15శాతం వాటాను తమ సంస్థ దక్కించుకుంటుందని ఆ సంస్థ సీఈవో సర్ జేజే స్లోటర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకే ఒక ఆర్కిటెక్చర్ పరిష్కార విధానంతో కంప్యూటర్ లోని ముఖ్యమైన సమాచారానికి, డాటా పాత్ లకు ఎగో సెక్యూర్ ఎండ్ పాయింట్ పూర్తి రక్షణగా నిలుస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.