: బీజేపీ కార్యవర్గ సమావేశానికి సమైక్య సెగ
తిరుపతిలో బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని అడ్డుకునేందుకు సమైక్యవాదులు ప్రయత్నించారు. సమావేశాలు జరిగే కళ్యాణమండపానికి వెళ్లడానికి సమైక్యవాదులు ప్రయత్నించగా అంతకుముందే పూర్ణకుంభం కూడలి వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీజేపీ తక్షణమే సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విద్యార్ధులు తిరుపతిలో భారీ ర్యాలీ చేపట్టారు.