: బోనాల పండుగ వచ్చేస్తోంది!
తెలంగాణ ప్రాంతంలో ఘనంగా జరుపుకునే పండుగల్లో బోనాలకు ప్రత్యేకస్థానం ఉంటుంది. ఇక్కడి సంస్కృతిని చాటడంలో బోనాల వేడుకలు ప్రముఖపాత్ర పోషిస్తాయి. ప్రతిఏడాది తొలి ఏకాదశికి ముందే వచ్చే ఈ సంబరం జులై 11 నుంచి మొదలై ఆగస్టు 5న ముగుస్తుందని రాష్ట్ర మంత్రి జె.గీతారెడ్డి తెలిపారు. బోనాల ఏర్పాట్లపై మంత్రి నేడు సచివాలయంలో అధికారులతో సమీక్ష జరిపారు. బోనాల కోసం సర్కారు రూ.20 లక్షలు మంజూరు చేస్తుందని ఆమె చెప్పారు. కాగా, జులై 11న గోల్కొండ బోనాలతో ప్రారంభమై.. 28న లష్కర్ (సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి) బోనాలు, ఆగస్టు 4 న లాల్ దర్వాజ బోనాలు, అనంతరం 5న రంగంతో ఉత్సవాలు ముగుస్తాయని గీతారెడ్డి వివరించారు.