: తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ కు లాభంలేదు: వెంకయ్య నాయుడు


తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ కు ఉపయోగం ఉండదని బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. తిరుపతిలో బీజేపీ జాతీయనేత వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటించినా ఆ పార్టీని ఎవరూ విశ్వసించరని అన్నారు. దిగ్విజయ్ సింగ్ పాత కథలే విన్పించారన్న వెంకయ్యనాయుడు, వామపక్షపార్టీలు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి ఆపద్భంధు మిత్రులేనని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ కు నరేంద్రమోడీ ఫోబియా పట్టుకుందని వెంకయ్యనాయుడు విమర్శించారు.

  • Loading...

More Telugu News