: తెలంగాణ ప్రకటనకు ఇదే మంచి తరుణం: జానారెడ్డి
తెలంగాణ ప్రకటించేందుకు ప్రస్తుతం అనుకూల పరిస్థితులు నెలకొని ఉన్నాయని మంత్రి కుందూరి జానారెడ్డి అన్నారు. పరిస్థితులు చేయిదాటకముందే సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించారు. ఈ క్రమంలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నాయకులు హైకమాండ్ కు సహకరించాలని కోరారు. హైదరాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ.. పురోభివృద్ధి, సంక్షేమం కోసమే విడిపోతున్నామని ఇరుప్రాంతాల ప్రజలు గ్రహించాలని సలహా ఇచ్చారు.