: టీడీపీతో పొత్తుకు సై అంటున్న సీపీఐ
తెలంగాణ విషయంలో టీఆర్ఎస్ తో కలిసి పోరాడుతున్న సీపీఐ.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలతో పొత్తుకోసం స్నేహహస్తం చాచుతోంది. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో సీపీఐ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ, సీపీఎంలతో పొత్తుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలకు సీపీఐ పూర్తి సన్నద్ధంగా ఉందని చెబుతూ, కాంగ్రెస్, బీజేపీలతో మాత్రం పొత్తుకు ససేమిరా అన్నారు. ఇక దిగ్విజయ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన మాటల్లో నవ్యత లేదని విమర్శించారు. కాంగ్రెస్ వి పాత విధానాలే అని మరోమారు స్పష్టమైందని అన్నారు.