: స్థానిక ఎన్నికల్లో మహిళలకు కచ్చితంగా రిజర్వేషన్లు అమలుచేయాలి: చంద్రబాబు


పంచాయతీ వార్డు సభ్యుని నుంచి నగరపాలక మేయర్ వరకు మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా కల్పించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. సహకార ఎన్నికల్లో లాగే పార్టీ గుర్తులతో కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని ఆరోపించిన బాబు, పార్టీ గుర్తులపైనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండు చేశారు. పార్టీ గుర్తువల్ల డబ్బులకు అమ్ముడుపోయిన వారి ఉద్యోగం పోతుందనే భయం ఏర్పడతుందని వివరించారు.

'వస్తున్నా మీకోసం' యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో మాట్లాడిన చంద్రబాబు కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. 2001 జనాభా లెక్కల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. సొంత పార్టీలు ఎందరు పెట్టినా నిలవలేరని అందుకు జనతాపార్టీ, పీఆర్పీలను ఆయన ఉదాహరణగా చూపారు.

  • Loading...

More Telugu News