: కావూరి ర్యాలీలో పేలుళ్లు.. ఒకరి మృతి
కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు అభినందన ర్యాలీ విషాదకరంగా మారింది. కేంద్ర మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన తన నియోజకవర్గానికి బయల్దేరారు. విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి వాహనాలలో ఏలూరుకు ప్రయాణమయ్యారు. అయితే కార్యకర్తలు ఆనందోత్సాలతో బాణసంచా కాల్చుతూ కాన్వాయ్ గా అనుసరించారు. ఇంతలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పేలుళ్లు జరిగాయి. నిప్పురవ్వలు వచ్చి బాణసంచా సరుకున్న ఆటోలో పడడంతో పేలుళ్లు జరిగాయని సమాచారం. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. మరికొందరు గాయపడ్డారని తెలుస్తోంది.