: పదేపదే చెబితే ప్రతికూలమేనట


ఏదైనా విషయాన్ని పదే పదే చెప్పడం వల్ల బాగా గుర్తుండి పోతుంది అని మనం అనుకుంటుంటాం. అయితే అన్ని సమయాల్లోను ఈ విషయం నిజం కాదని పదే పదే చెప్పడం వల్ల గుర్తుండే విషయం పక్కనుంచి ఆ విషయాన్ని గురించి మరిచిపోయే ప్రమాదముందని అమెరికా వైద్య నిపుణులు చెబుతున్నారు.

తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పుడు మాత్రం అన్ని రకాల ఆహారపదార్ధాలను తినిపించేస్తారు. తర్వాత పెద్దయ్యాక ఆహారం తగ్గించమని సలహాలనిస్తుంటారు. చిన్న వయసులో బాగా తింటే ఆరోగ్యంగా ఉంటారని చెప్పి పిల్లల చేత ఆహారపదార్ధాలను తినిపించిన తర్వాత పెద్దయ్యాక లావుగా ఉంటే బాగుండదని, ఆహారంలో నియంత్రణ చేసుకోవాలని సూచిస్తుంటారు. ఇది తినకూడదు, అది తినకూడదూ అంటూ పిల్లలపై ఆహారానికి సంబంధించిన ఆంక్షలు విధిస్తుంటారు. ఇలా పదే పదే పిల్లల వద్ద తిండీ, బరువుకు సంబంధించిన ప్రస్తావన వస్తుంటే అది వారిని మానసికంగా దెబ్బతీసే ప్రమాదముందని మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది వారిలో అనుకూలానికి బదులు ప్రతికూల పరిణామాలకు దారితీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News