: పిల్లిద్వారా క్షయ వ్యాధి వస్తుంది!


పెంపుడు జంతువుల్లో కొందరికి పిల్లులంటే మక్కువ ఎక్కువే. అయితే ఇలా మార్జాలంపై మక్కువ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి వారికి క్షయ వ్యాధి సోకే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పిల్లుల ద్వారా మనుషులకు క్షయ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బ్రిటన్‌లోని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక తాజా అధ్యయనంలో పిల్లులను పెంచుకునే వారికి క్షయ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. క్షయ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాను పిల్లులు మనుషులకు సంక్రమించేలా చేస్తున్నాయని శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ అధ్యయనంలో తేలింది. ఎలుకలు, పశువులు, కుక్కల నుండి మైకోబ్యాక్టీరియం బోవిస్‌ అనే బ్యాక్టీరియా పిల్లులకు చేరుతోందని, ఈ బ్యాక్టీరియా సోకిన పాలను తాగడం వల్ల పిల్లులు క్షయ వ్యాధి బారిన పడుతున్నాయని, వీటిద్వారా పిల్లుల యజమానులకు క్షయవ్యాధి సంక్రమిస్తుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. నిజానికి పిల్లుల నుండి మనుషులకు క్షయ వ్యాధి సోకడం అనేది చాలా అరుదైనప్పటికీ పిల్లులను పెంచుకునేవారు జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News