: అట్టహాసంగా జరిగిన 'ఎవడు' ఆడియో విడుదల
రాంచరణ్, శృతి హాసన్ జంటగా నటిచిన 'ఎవడు' సినిమా ఆడియో విడుదల హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఆడియో విడుదలకు సినీ తారాగణం భారీగా హాజరై అట్టహాసంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు, కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, అల్లు అర్జున్, రాంచరణ్, శృతి హాసన్, సాయికుమార్, శశాంక్, దిల్ రాజు వంటి సినీరంగ ప్రముఖులు హాజరయ్యారు. పలువురు నటీనటులు హాజరై ఈ సినిమా వేడుకను ఆహ్లాదకరంగా మార్చగా, తమ వ్యాఖ్యానంతో సుమ, వేణుమాధవ్ ఆడియో వేడుకను రక్తి కట్టించారు. దేవీ ప్రసాద్ స్వర పరిచిన గీతాలు అభిమానుల్ని విశేషంగా అలరించాయి. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ బాధితుల సహాయార్థం అభిమానులు నిధులను సేకరించి కేంద్ర మంత్రి చిరంజీవికి అందజేశారు.