: ఇలాంటి సినిమా కథ నేనింత వరకూ వినలేదు :చరణ్
ఇలాంటి సినిమా కథ తానింత వరకూ వినలేదని రాంచరణ్ తెలిపారు. మిగతా సినిమాలకంటే 'ఎవడు'లో ఎక్కువ ఆందంగా ఉంటానని, దానికి కారణం కెమెరా మెన్ రామ్ ప్రసాద్ అని రాం చరణ్ తెలిపాడు. 'ఎవడు' ఆడియో విడుదల సందర్భంగా మాట్లాడుతూ అబిమానులకు కావాల్సిన అన్ని హంగులూ ఈ సినిమాలో ఉన్నాయన్నారు. సినిమా కథ విన్న తరువాత దర్శకుడు వంశీ పైడిపల్లిని గట్టిగా కౌగిలించుకున్నానని చరణ్ తెలిపారు. సినిమా మగధీర తరువాత ఆ స్థాయిలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.