: పవన్ కల్యాణ్ బాటలోనే రియల్ హీరోలైన అల్లు అర్జున్, రాం చరణ్
'ఎవడు' ఆడియో విడుదల సందర్భంగా ప్రముఖ సినీ హీరోలు అల్లు అర్జున్, రాంచరణ్ ఉత్తరాఖండ్ వరదబాధితుల పునరావాసానికి విరాళమిచ్చి నిజంగా హీరోలమనిపించుకున్నారు. ఉత్తరాఖండ్ వరద బాధితులకోసం 10 లక్షల చొప్పున అల్లు అర్జున్, రాంచరణ్ విరాళం ప్రకటించి తమ గొప్ప మనసును చాటుకున్నారు. దీంతో సినిమాల్లోనే కాకుండా రియల్ హీరోలు కూడా అనిపించుకున్నారు. ఇంతకు ముందే 24 లక్షల రూపాయల విరాళాన్ని ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.