: కొత్త గవర్నర్ల నియామకం
పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, ఢిల్లీ లకు లెఫ్టినెంట్ గవర్నర్లను, మేఘాలయా రాష్ట్రానికి గవర్నర్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మేఘాలయ రాష్ట్ర గవర్నర్ గా ఢిల్లీ మాజీ పోలీస్ కమీషనర్ కేకే పాల్ ను నియమించారు. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నజీబ్ జంగ్ ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా, అండమాన్ నికోబార్ దీవులకు లెఫ్టినెంట్ గవర్నర్ గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేకే సింగ్ ను, వీరేంద్ర కటారియాను పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.