: స్థానిక ఎన్నికలపై ఆరా తీసిన దిగ్విజయ్ సింగ్
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన పీసీసీ సమన్వయ కమిటీ భేటీలో స్థానిక ఎన్నికలపై చర్చించినట్టు సమాచారం. స్ధానిక ఎన్నికలు, అభ్యర్థుల ఎన్నిక విధానం గురించి దిగ్విజయ్ సింగ్ స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు. సిట్టింగ్ ఎంపీలు లేని చోట యువజన కాంగ్రెస్ నేతలను ప్రోత్సహించాలని బొత్సకు సూచించారు. పటిష్ఠ ప్రణాళికతో సాధారణ ఎన్నికలకు సిద్దం కావాలని పీసీసీ సమన్వయ కమిటీకి దిగ్విజయ్ సింగ్ సూచించారు.