: విభజన తేలిక కాదు: దిగ్విజయ్ సింగ్


తెలంగాణపై మిగిలింది నిర్ణయమేనని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర విభజన కష్టమని తేల్చిచెప్పారు. తనకన్నా ముందు రాష్ట్ర వ్యవహారాలు చూసిన మొయిలీ, ఆజాద్ రాజకీయ పక్షాలు ప్రజాప్రతినిధుల స్థాయిలో విస్తృతంగా చర్చలు జరిపారన్న దిగ్విజయ్, ఇక మిగిలింది నిర్ణయమే అన్నారు. విభజన, సమైక్యం రెండు అంశాలను ద్రుష్టిలో ఉంచుకుని రోడ్ మ్యాప్ తయారు చేసేందుకు సీఎం, డిప్యుటీ సీఎం, పీసీసీ చీఫ్ చర్చిస్తారని తెలిపారు. ఏ నిర్ణయం తీసుకున్నా దేశ, రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. తాను ఛత్తీస్ గఢ్ ఏర్పాటు చూశానని, విభజన అంత తేలిక కాదని అన్నారు.

రాహుల్ గాంధీ ఉపాధ్యక్షుడయ్యాక 3 నెలలకోసారి పార్టీ స్థితిగతులపై సమీక్షిస్తున్నారని తెలిపారు. ఇరవై సూత్రాల అమలులో రాష్ట్రం అగ్రపధాన కొనసాగుతుండడం పట్ల అభినందనలు తెలిపారు. ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ తెచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. కాంగ్రెస్ ముందు 2014 రాజకీయ సవాలు ఉందని, గత రెండు ఎన్నికల్లో భారీ ఆధిక్యం రావడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర కేబినెట్ లో 12 మంది ఉన్నారని తెలిపారు.

కేబినెట్ మంత్రులుగా నలుగురు, సహాయ మంత్రులుగా 8 మంది ఉన్నారని అన్నారు. వైఎస్సార్ సీపీ కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తూ అధిష్ఠానాన్ని దూషించడం దురదృష్టం అని అన్నారు. గతంలో చెప్పినట్టు రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయలేకపోయామని తెలిపారు.

  • Loading...

More Telugu News